IED blast: జమ్ములో ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి

by Shamantha N |
IED blast: జమ్ములో ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఇద్దరు జవాన్లు బలయ్యారు. అఖ్నూర్ సెక్టార్‌లో ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లు చనిపోగా.. మరొకరికి గాయాలయయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వాస్తవాధీన రేఖ (LoC) వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. తీవ్రగాయాలపాలన ముగ్గురిని సమీప ఆస్పత్రికి తరలించగా.. కెప్టెన్ సహా ఇద్దరు అమరులైనట్లు వెల్లడించారు. గాయపడిన సైనికుడిని చికిత్స కోసం సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించామన్నారు. ప్రస్తుతం అతడికి ప్రాణపాయం ఏమీ లేదని చెప్పారు.కాగా..పేలుడు తర్వాత సరిహద్దుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. ఇద్దరు సైనికుల మృతిని ధ్రువీకరిస్తూ వైట్ నైట్ కార్ప్స్ యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇద్దరు సైనికుల త్యాగానికి నివాళులర్పించింది.



Next Story