- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: 300 రోజుల్లో 160 బెదిరింపులు కాల్స్..!
దిశ, నేషనల్ బ్యూరో: బెదిరింపులతో ఢిల్లీ వ్యాపారులు(Delhi businessmen) ఆందోళన చెందుతున్నారు. బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని విదేశాల్లోని గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులు బెదిరింపు(extortion calls)లకు పాల్పడుతున్నారని ఢిల్లీ(Delhi) పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దాదాపు 160 థ్రెట్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. అంటే, దాదాపు 300 రోజుల్లోనే 160 వరకు బెదిరంపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో వ్యాపారులను బెదిరిస్తూ, హత్యలకు పాల్పడుతున్న 11 ముఠాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్, హిమాన్షు భౌ, కపిల్ సాంగ్వాన్ అలియాస్ నందు, జితేందర్ గోగి-సంపత్ నెహ్రా, హషీమ్ బాబా, సునీల్ టిల్లు, కౌశల్ చౌదరి, నీరజ్ ఫరీద్‌పురియా వంటి గ్యాంగ్‌లు ఉన్నాయని వెల్లడించారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక సెల్, క్రైమ్ బ్రాంచ్‌లు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.
వ్యాపారులకు బెదిరింపులు
బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, నగలు, మిఠాయి దుకాణాలు, కార్ల షోరూం యజమానులకు ఎక్కువగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పోలీసులు తెలిపారు. కొందరు వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లపైనా దుండగులు కాల్పులకు పాల్పడుతుండటంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల రోహిణి ప్రాంతంలోని వ్యాపారికి చెందిన షోరూంలోకి ముగ్గురు దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. యోగేష్ దహియా, ఫజ్జే భాయ్‌లకు రూ.10 కోట్లు ఇవ్వాలని రాసి ఉన్న నోట్‌ను అక్కడ వదిలివెళ్లారు. మరో కేసులో నంగ్లోయ్‌లోని జిమ్ యజమాని నుంచి రూ.7 కోట్లు డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ నంబర్ నుంచి కాల్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు, గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ అనుచరులుగా దుండగులు తమని తాము పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.