- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Rajasthan : శోభాయాత్రపైకి రాళ్లదాడి.. పోలీసుల అదుపులో 12 మంది
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని షాపురా పట్టణం పరిధిలో ఉన్న జహాజ్‌పూర్ ఏరియాలో జల్‌జులి ఏకాదశి సందర్భంగా శనివారం రోజు బేవాన్ శోభాయాత్రను నిర్వహించారు. అయితే ఈసందర్భంగా కొందరు అల్లరిమూకలు యాత్రపైకి రాళ్లు రువ్వారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిసర ప్రాంతాలకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీని సేకరించి దాని ఆధారంగా 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిని జిల్లా కలెక్టర్, ఎస్పీ శాంతింపజేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈవివరాలను బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. నిందితులను వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకొని తీరుతామని రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేడం స్పష్టం చేశారు.