Journalists: ఈ ఏడాది 104 మంది జర్నలిస్టులు మృతి.. ఐఎఫ్ జే నివేదికలో సంచలనాలు

by Shamantha N |
Journalists: ఈ ఏడాది 104 మంది జర్నలిస్టులు మృతి.. ఐఎఫ్ జే నివేదికలో సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ఇలా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తలు నెలకొన్నాయి. కాగా.. ఈ ఉద్రిక్తతలకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన పలువురు జర్నలిస్టులు(journalists) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది దాదాపు 104 మంది జర్నలిస్టులు చనిపోయినట్లు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (IFJ) నివేదిక విడుదల చేసింది. అందులో సగం మంది గాజా (Gaza)లోనే మరణించడం గమనార్హం. ఈ ఏడాదిలో 104 మంది జర్నలిస్టులు మృతి చెందారు. కాగా.. గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో 55 మంది పాలస్తీనా జర్నలిస్టులు చనిపోయినట్లు నివేదిక చెబుతోంది. అయితే, 2023 ఏడాదిలో చనిపోయిన జర్నలిస్టుల సంఖ్య 129గా ఉంది. అయినప్పటికీ, అత్యంత ఘోరమైన సంవత్సరాల్లో 2024 నిలిచిందని ఐఎఫ్‌జే ప్రధాన కార్యదర్శి ఆంథోనీ బెల్లాంగర్( IFJ general secretary Anthony Bellanger)పేర్కొన్నారు. ‘2023 అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి గాజాలో కనీసం 138 మంది జర్నలిస్టులు చనిపోయారు. వారిలో చాలామందిని ఉద్దేశపూర్వకంగా చంపేయగా.. మరికొందరు యుద్ధంలో మరణించారు’ అని తెలిపారు.

ఆసియాలో 20 మంది మృతి

ఇకపోతే, ఆసియాలో 20 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు తెలిపింది. వారిలో ఆరుగురు పాకిస్థాన్‌ (Pakistan)లో, ఐదుగురు బంగ్లాదేశ్‌ (Bangladesh), నలుగురు ఉక్రెయిన్‌ (Ukraine)యుద్ధంలో, ముగ్గురు భారత్‌ (India)లో మరణించినట్లు పేర్కొంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 520 మంది జర్నలిస్టులు జైలులో ఉన్నట్లు ఐఎఫ్‌జే తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 427గా ఉంది. ఇందులో చైనా (China) మొదటిస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. దాదాపు 135 మంది జర్నలిస్టులను హాంకాంగ్‌లో నిర్బంధించినట్లు పేర్కొంది. అసమ్మతి, ఇతర స్వేచ్ఛలను రద్దు చేస్తూ జాతీయ భద్రతా చట్టాలను విధించినందుకు బీజంగ్ పై ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, 2023లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్‌ అనే ఎన్జీవో ఓ నివేదికను విడుదల చేసింది. అందులో, గతేడాది 54 మంది జర్నలిస్టులు, ఇద్దరు సహకారులు చనిపోయినట్లు తెలిపింది. కాగా.. ఈ ఏడాదికి సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రచురించనుంది.

Next Story

Most Viewed