- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిఫెన్స్, నావల్ అకాడమీ ఎగ్జామ్స్.. మాస్కు తప్పనిసరి..!
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ , నావల్ అకాడమీ పరీక్షలు 2021 సజావుగా జరిగేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో మొత్తం 15 సెంటర్లలో 6,329 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు.
రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మ్యాథమెటిక్స్ , మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న ఈ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు లేని వారిని పరీక్షకు అనుమతించబోమన్నారు. అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. మొబైల్ ఫోన్స్, ట్యాబ్‌లు, పెన్ డ్రైవ్, వాచీలు, క్యాలుక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పర్సులు, వాలెట్స్, నోట్సులు, చాట్స్, ఇతర రికార్డింగు పరికరాల వంటి వాటికి అనుమతి లేదని వివరించారు. కార్యక్రమంలో యూపీపీఎస్సీ తనిఖీ అధికారి పృద్వీసింగ్ తదితరులు పాల్గొన్నారు.