ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు

by Shyam |
ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు
X

దిశ, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రెమా రాజేశ్వరికి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోయిలకొండ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ 2018‌లో 3.14 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో వెంకటమ్మ తమ్ముడు ఆమెను మోసం చేసి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం దానిని ఆమెకే ఇస్తానని నమ్మించాడు. కొద్ది రోజులకు ఆ స్థలాన్ని వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. ఇదేంటని అడిగిన తనను అతడు భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బాధితురాలు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్, ఎస్పీకి కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story