నాట్కో ఫార్మా నికర లాభం 14 శాతం క్షీణత

by Harish |   ( Updated:2020-08-12 08:18:30.0  )
నాట్కో ఫార్మా నికర లాభం 14 శాతం క్షీణత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా(Natco Pharma) 2020-21 ఆర్థిక సంవత్సరానికి(Financial year) జూన్‌తో ముగిసిన త్రైమాసికం(Quarter)లో నికర లాభం(Net profit) 14.49 శాతం క్షీణించి రూ. 122.1 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ. 142.8 కోట్ల నికర లాభాన్ని(Profit) ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో పేర్కొంది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం(Company total revenue) రూ. 582.1 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం(Financial year)లో ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 513.3 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో కంపెనీ మార్జిన్(Margin) ఒత్తిడిని ఎదుర్కొందని నాట్కో ఫార్మా(Natco Pharma) ఎక్స్ఛేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘గత త్రైమాసికంలో తక్కువ మార్జిన్లు ఉన్నప్పటికీ ఆదాయం ఆధారంగా కంపెనీ నమ్మకంతో ఉందని, ప్రస్తుత సంవత్సరానికి సంపాదనలో 25 శాతం వృద్ధిని కంపెనీ ఆశిస్తోందని తెలిపింది. ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్‌(Equity share)కు రూ. 1.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌(Interim dividend)ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్టు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed