- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాసా ‘లూనార్ లూ చాలెంజ్’
దిశ, వెబ్‌డెస్క్ : ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు పంపేందుకు ‘నాసా’ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆస్ట్రోనాట్స్.. లూనార్ సర్ఫేస్‌కు చేరుకున్న తర్వాత బాత్రూమ్‌కు వెళ్లేందుకు ప్లేస్ కావాలని వెతుకుతోంది. ఈ నేపథ్యంలో సోలార్ సిస్టమ్‌లో ‘బెస్ట్ మూన్ టాయిలెట్’ కోసం ప్లాన్లు ఇవ్వాలని ఇంజినీర్లకు సూచించింది. ‘ఈజీ టూ యూజ్ లూనార్ రెస్ట్ రూమ్’ ఐడియా ఎవరిస్తారో వారికి 35 వేల డాలర్ల ప్రైజ్ మనీ కూడా ఇస్తుందట. అందుకోసం నాసా ‘లూనార్ లూ చాలెంజ్’ను అనౌన్స్ చేసింది.
నాసా, హీరో ఎక్స్‌తో కలిసి ఈ ‘లూనార్ లూ ఛాలెంజ్’ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. కాగా, 2024 సంవత్సరానికి కల్లా.. ఓ మహిళ ఆస్ట్రోనాట్‌ను, ఓ మేల్ ఆస్ట్రోనాట్‌ను చంద్రుడి చెంతకు పంపేందుకు నాసా ప్లాన్ చేస్తోంది. అయితే భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు మాత్రమే లూనార్ సర్ఫేస్ మీద ఉంటుంది. దీంతో వ్యోమగాములు వెయిట్‌లెస్‌గా ఉంటారు. అలాంటి సర్ఫేస్‌లో అన్నీ గాల్లోనే తిరుగాడుతుంటాయి. పైటా అలాంటి టైమ్‌లో గాల్లో తిరుగాడే వస్తువులన్నీ ఒకదానికొకటి కలిసిపోయే అవకాశం ఉంది. అందుకోసమే.. భవిష్యత్‌లో చంద్రుని మీదకు చేరుకుంటే అక్కడ టాయిలెట్ ఎలా వాడాలనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. బాత్రూమ్ టెక్నాలజీ అనేది భూమిపై కంటే అడ్వాన్స్‌డ్‌గా ఉండాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. చంద్రుని మీదకు ఆస్ట్రోనాట్స్ పంపేకంటే ముందే అక్కడ రెస్ట్ రూమ్‌లు నిర్మించాలని నాసా యోచిస్తోంది.