- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చుక్కల లోకంలోకి ఆహ్వానం.. అర్హతలు ఇవే!
దిశ, ఫీచర్స్ : ‘భూమి’ని అనుభవిస్తున్న మనిషి చంద్రమండలంపై కోటలు కట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. చుక్కల లోకంలో విహరిస్తూ, అంగారక గ్రహంపై జీవించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ మేరకు అమెరికన్ స్టార్టప్ వార్ద స్పేస్ ఇండస్ట్రీస్ రోదసిలో ఫ్యాక్టరీలు నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తుండగా, మరెన్నో స్పేస్ కంపెనీలు అంతరిక్షంలో మానవ నివాసాలు ఏర్పాటు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. మరి మార్స్ మీద మానవ నివాసం సాధ్యమవుతుందా? అక్కడి వాతావరణం మనకు సరిపోలుతుందా? అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వంటి అనేక సందేహాలకు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఓ పరిష్కారం చూపనుంది. ఈ క్రమంలో భూమిపైనే అంగారక గ్రహ వాతావరణాన్ని తయారు చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావడానికి ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా.. ఓసారి మనం కూడా రెడ్ ప్లానెట్‌లో ఏముందో చూసొద్దాం!
మార్షియన్ ఉపరితలంపై మానవ జీవనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు త్వరలో నాసా మూడు మిషన్స్ చేపట్టనుంది. ఇందులో ‘క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్’(CHAPEA) తొలి మిషన్ కాగా.. ఈ సుదీర్ఘ అనలాగ్ మిషన్ ఏడాది పాటు కొనసాగనుంది. ఇందుకోసం హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న ఓ భవనంలో 1,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో కృత్రిమ అంగారక వాతావరణాన్ని సృష్టించారు. మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలువబడే దీన్ని త్రీడీ ప్రింటర్ సహాయంతో రూపొందించారు.
ఈ మిషన్‌లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థుల కోసం నాసా ఆగస్టు 6నుంచి అప్లికేషన్స్ కోరుతుండగా, సెప్టెంబర్ 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు ఎంపిక చేసిన నలుగురు ఏడాది పాటు మార్స్ డ్యూన్ ఆల్ఫాలో నివసించాలి. దీంతో కృత్రిమ అంగారక వాతావరణంలో నివసిస్తున్న వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో నాసా అధ్యయనం చేస్తుంది. ఈ సమయంలో సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను అధిగమించి అంగారకుడిపై నివాసానికి అన్ని విధాలుగానూ మానవ జాతిని సిద్ధం చేసేందుకు నాసా ప్రయత్నిస్తుంది. ఇక తొలి మిషన్ 2022లో ప్రారంభమవుతుండగా, రెండో అనలాగ్ మిషన్ 2024, మూడోది 2025లో జరగనున్నాయి.
‘మార్స్ డ్యూన్ ఆల్ఫా’లో వంటగది, వైద్యం, వినోదం, ఫిట్‌నెస్, వర్క్ స్పేస్, క్రాప్ గ్రోత్, టెక్నికల్ వర్క్ ఏరియాలతో పాటు రెండు బాత్రూమ్స్ ఉన్నాయి. పరిమిత వనరులు, ఎక్విప్‌మెంట్ ఫెయిల్యూర్, కమ్యూనికేషన్ డిలే వంటి సమస్యలతో పాటు ఏవైనా ఇతర పర్యావరణ ఒత్తిళ్ల మధ్య అంగారకుడిపై కార్యకలాపాలు నిర్వహించడం ఎలా ఉంటుందో ఈ ఆవాసాల్లో నివసిస్తూ తెలుసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనలు కొనసాగిస్తూనే, స్పేస్ వాక్స్ చేస్తారు.
వర్చువల్ రియాలిటీ, రోబోటిక్ కంట్రోల్స్ వంటి ఆధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలను కూడా ఉపయోగించుకుంటారు. ఈ అనలాగ్ మిషన్ ద్వారా వచ్చే ఫలితాలు శాస్త్రీయ డేటాను అందిస్తాయి. ఆ డేటా అంగారక గ్రహంపై వాస్తవ కార్యకలాపాల కోసం ఉపయోగించే వ్యవస్థలను ధృవీకరించడంలో సాయపడతాయి. అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందువల్లే పరిశోధకులు అనలాగ్ మిషన్స్ చేస్తారు.
అర్హత..
అభ్యర్థుల ఎంపిక ప్రామాణిక NASA ప్రమాణాలను అనుసరిస్తుంది. దరఖాస్తుదారుడు యూఎస్ పౌరుడు లేదా శాశ్వత నివాసి అయి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేయడంతో పాటు 30-55 సంవత్సరాల లోపు ఉండాలి. స్టెమ్ ఫీల్డ్‌లో కనీసం రెండు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి. స్టెమ్‌లో డాక్టరల్ ప్రోగ్రామ్ కోసం రెండు సంవత్సరాల పని పూర్తి చేసిన లేదా మెడికల్ డిగ్రీ లేదా టెస్ట్ పైలట్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పరిగణిస్తారు.
అదనంగా నాలుగు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవంతో స్టెమ్ ఫీల్డ్‌లో మిలిటరీ ఆఫీసర్ ట్రైనింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన దరఖాస్తుదారులు కన్సిడర్ చేస్తారు. ఆరోగ్యవంతుడై, ఆంగ్లంలో ప్రావీణ్యం ఉండాలి. ఇక బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఏడాది పాటు జరిగే ఐసోలేషన్ మిషన్ కావడంతో అతడి సామర్థ్యాన్ని గుర్తించడానికి వైద్యులు మానసిక పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాదు నిర్దిష్ట ఔషధాలు తీసుకునే అభ్యర్థులు అనర్హులు. అభ్యర్థులు కొవిడ్ -19 వ్యాక్సిన్ పూర్తి టీకా తీసుకున్నట్టుగా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.
నాసా చేపడుతున్న ఈ మిషన్ తరహాలో గతంలో ‘మార్స్ 500’ పేరుతో రష్యా ఓ అంగారక మిషన్ చేపట్టగా అది ఫెయిల్ అయింది. మరి నాసా ఇందులో విజయవంతమవుతుందా లేదా చూడాలి.