నర్సింగాపూర్ సర్పంచ్ సస్పెన్షన్

by  |

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ సర్పంచ్ రాపెల్లి గంగాధర్ పై సస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. 6 నెలలు సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 22న గ్రామంలోని మల్లె గుట్ట ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో నాటిన సుమారు 1100 మొక్కలను ధ్వంసం చేశారని గ్రామ వార్డు సభ్యులు పిర్యాదు చేశారు. ఈ విషయంపై డీఆర్డీవో, డీపీవోలు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సర్పంచ్ పై పోలీస్ స్టేషన్ లో, అటవీ శాఖలో ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ నెల 28న జిల్లా కలెక్టర్ సర్పంచ్ కు షోకాజు నోటీస్ జారీ చేయగా ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్ పై వేటు పడడం జిల్లాలో ఇదే మొదటిది కావడం విశేషం. చెట్లనను ధ్వంసం చేసిన విషయాన్ని సకాలంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీవో రవీందర్, ఎంపీవో ప్రదీప్ కుమార్, ఏపీవో అరుణలకు మెమోలు జారీచేశారు.


Next Story