జగన్ జైలుకెళ్తే ఆ పదవి కోసం కుట్ర: రఘురామకృష్ణంరాజు హెచ్చరిక

by srinivas |
raghurama krishnam raju
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు ప్రశ్నలు అడిగి సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రంతో ప్రైవేటీకరణపై పునరాలోచిస్తామని చెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటేయరని అర్ధమవుతోందన్నారు. సీఎం జగన్‌కు 100 మంది సలహాదారులు అవసరమా అంటూ ప్రశ్నించారు. జగన్ జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలని కుట్ర అన్న.. రిపబ్లిక్ టీవీ వార్తను తేలిగ్గా తీసుకోవద్దని ఎంపీ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.



Next Story

Most Viewed