ఏంట్రా రాజీనామా చేసేది.. మీరు చేయండి

by  |
ఏంట్రా రాజీనామా చేసేది.. మీరు చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్‌పై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. తనపై వస్తున్న కామెంట్లపై విమర్శలు గుప్పించారు. మొన్న వైఎస్ రెడ్డి… నిన్న రామిరెడ్డి అట.. తనను రాజీనామా చేయాలని ఏదేదో మాట్లాడుతున్నారు. నా ఇంటి దగ్గరకు వస్తే సీఆర్పీఎఫ్ వాళ్లు షూట్ చేస్తారు.. ఏంట్రా రాజీనామా చేసేది, మీరు చేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూజ్‌లెస్ ఫెలోస్‌ మీరు రాజీనామా చేయండి.. అమరావతి అక్కడే ఉంటుందంటూ అబ్దాలాడి అధికారంలోకి వచ్చారు. నేను ప్రజామోదంతో గెలిచా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ ఢిల్లీలో మీడియాతో అన్నారు.

నా గెలుపులో జగన్ 90శాతం కారణం అయితే నా బొమ్మతో నేను కూడా నెగ్గానని… నన్నెవరు బెదిరించారో వారికే చెబుతున్నా జాగ్రత్తగా ఉంండాలని హితవు పలికారు. రాజీనామా.. రాజీనామా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడకండి. పాపులు శిక్షించబడుదురు. నాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తే ఎవరూ స్పందించడం లేదని… దీనిపై లోకాయుక్తలో కూడా పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed