షాకింగ్ న్యూస్: ఒకేరోజు ఇద్దరు తహసీల్దార్‌లు బాధ్యతలు

by Shyam |   ( Updated:2021-08-13 11:58:13.0  )
Narketpally-MRO-Office
X

దిశ, నకిరేకల్: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్ రాధా బదిలీ కావడంతో నూతన తహసీల్దార్ నియామకంలో గందరగోళం చోటుచేసుకుంది. ఒకేరోజు ఇద్దరు తహసీల్దార్‌‌లు బాధ్యతలు చేపట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల నాలుగవ తేదీన మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోకన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలిశారన్న నిఘా వర్గాల సమాచారంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నార్కట్‌పల్లి తహసీల్దార్ రాధను పీఏపల్లికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. పీఏపల్లి తహసీల్దార్‌ దేవదాసును నార్కట్‌పల్లికి బదిలీ చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం దేవదాస్ నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కొద్దిగంటల వ్యవధిలోనే కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ వెంటనే మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డి నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో కార్యాలయ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకేరోజు ఇద్దరు తహసీల్దార్లు గంటల వ్యవధిలోనే బాధ్యతలు చేపట్టడంతో షాక్‌కు గురయ్యారు. సినిమా తరహాలో ఉందంటూ గుసగుసలు ఆడుకున్నారు.

Advertisement

Next Story