చిరు ప్రయత్నానికి మోడీ ప్రశంస

by Shyam |
చిరు ప్రయత్నానికి మోడీ ప్రశంస
X

వినే టైమ్ చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోతుంది. అందుకే తమ అభిమాన హీరోలు చెప్పిన మాటలు ఖచ్చితంగా ఫాలో అయిపోతారు ప్రజలు. ఒక సెలబ్రిటీ చెప్పిన మాటకు…. మామూలు మనిషి చెప్పిన మాటకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఏదైనా బ్రాండ్ గురించి అడ్వర్టజ్మెంట్ ఇవ్వాలంటే ప్రముఖులను ఎంచుకుంటారు. ఎందుకంటే జనం వారు చెప్పే మాటలు నమ్ముతారు… అదే ఫాలో అవుతారనే నమ్మకం. అందుకే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు సినీ ప్రముఖులనే ఎంచుకున్నాయి. వారి ద్వారానే ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశాయి. కరోనా నుంచి ప్రజలను విముక్తి చేయడాన్ని బాధ్యతగా తీసుకున్న కొందరు సినీ ప్రముఖులు… తమ వంతు ప్రయత్నంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే సినీ కార్మికులను ఆదుకునేందుకు నెలకొల్పిన కరోనా క్రైసిస్ చారిటీ ట్రస్ట్ ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్వరపరిచిన పాటకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ నటించి… కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఫైట్ చేయాలనే దానిపై సందేశం ఇచ్చారు.

వి వన ఫైట్ కరోనా ఏదేమైనా… చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా.. అంటూ సాగే ఈ పాట పై ప్రధానమంత్రి మోడీ ప్రశంసలు కురిపించారు. చిరు, నాగ్, తేజ్, వరుణ్ ల ప్రయత్నాన్ని అభినందిస్తూ… తెలుగులో ట్వీట్ చేశారు. మీరు ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు అని తెలిపారు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం…అందరం సామాజిక దూరం పాటిద్దాం…కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం … అని ట్వీట్ చేశారు మోడీ.


Tags: IndiaFightsCorona, Modi, CCC, Chiranjeevi, prime minister

Advertisement

Next Story

Most Viewed