జేపీకి మోదీ, అమిత్ షా నివాళులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హాస్యనటుడు జయ ప్రకాశ్ రెడ్డి మృతితో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
జేపీ మృతి పట్ల దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు ట్విట్టర్‌ వేదికగా నివాళులు అర్పిస్తూ.. తెలుగులోనే ట్వీట్ చేశారు.

‘జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.
-మోదీ

గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి గారి అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. -అమిత్ షా

Advertisement