సోనుసూద్‌ కోసం సాహసం.. 2 వేల కి.మీ సైక్లింగ్‌!

by Anukaran |   ( Updated:2021-01-29 06:52:49.0  )
సోనుసూద్‌ కోసం సాహసం.. 2 వేల కి.మీ సైక్లింగ్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: సోనుసూద్.. ప్రస్తుతం దేశంలో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేస్తూ.. సినీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన సోను ప్రస్తుతం దేశం మొత్తానికి పరిచయమయ్యాడు. కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లో.. కష్టాలో ఉన్నవారిని ఆదుకుంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. వలస కార్మికులను సొంతగూటికి చేర్చడమే గాకుండా, విద్యార్థుల సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాడు. అంతేగాకుండా శ్వాస‌కోశ స‌మ‌స్య ఉన్న బాలుడికి సోనూసూద్ అండ‌గా నిలిచారు. అనారోగ్యం బారిన ప‌డ్డ బాలుడిని సోమ‌వారం ముంబై ఎస్ఆర్‌సీసీ ఆస్ప‌త్రిలో చేర్పించి, స‌ర్జ‌రీ చేయించాడు. అనంతరం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్‌ ద్వారా భరోసా ఇచ్చి, మాట నిలబెట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆపద ఉన్నదని తెలిసిన ప్రతిచోటా సోసుసూద్ దేవుడిలా నిల్చొని అపన్నహస్తం అందించాడు. దీంతో స్ర్కీన్‌పై విలన్ క్యారెక్టర్‌లు చేసే రియల్ హీరో సోనూభాయ్ అంటూ అందరూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

అయితే… కరోనా సమయంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చిన దేవుడిని కలిసిందుకు ఓ వ్యక్తి సాహసం చేశాడు. ఎలాగైనా సోనూను కలవాలని 2 వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వివరాళ్లోకి వెళితే… మహారాష్ట్రలోని వషీమ్ ప్రాంతానికి చెందిన నారాయణ్ కిషన్ లాల్ వ్యాస్ అనే సైక్లిస్ట్ సోనూసూద్ మీద ఉన్న అభిమానంతో.. ఆపదలో ఉన్న దేశ ప్రజలను ఆదుకుంటున్న సోనూను గౌరవించేందుకు చేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా ఐదేళ్ల నుంచి సామాజిక, జాతీయ సమస్యల మీద ఐదేళ్లుగా సైక్లింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి దేశవ్యాప్తంగా హీరోగా మారిన సోనూసూద్ కోసం తన సైక్లింగ్‌ సాహసాన్ని అంకితమిస్తూ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు రెండు వేల కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు.

కిషన్ లాల్ వ్యాస్ మహారాష్ట్ర నుంచి రామ సేతు వరకు తన ప్రయాణం పూర్తవుతుందని తెలిపారు. వషీమ్, హైదరాబాద్, బెంగళూరు, మధురై, రామసేతుల మీదుగా రెండు వేల కిలోమీటర్ల వరకు చేయనున్నానని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ స్పందిస్తూ… తనకోసం కిషన్ లాల్ వ్యాస్ చేయాలనుకుంటున్న సైక్లింగ్ రైడ్‌లో ఎప్పటికీ పొందలేని అతిపెద్ద పురస్కారం అని ప్రశంసించాడు. అంతేగాకుండా దేశంలోనే అత్యంత మానవత్వం కలిగిన సోనుసూద్ కోసం ఇంతటి సాహసం చేయదలిచిన కిషన్ లాల్ వ్యాస్ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed