నా మిత్రుడి మరణం బాధించింది: ఆర్‌ఆర్‌ఆర్

దిశ, వెబ్ డెస్క్: కరోనా రక్కసి ధాటికి ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు బలయ్యారు. ఆయన గురువారం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. మాణిక్యాలరావు తనకు ప్రియమిత్రుడని అన్నారు. మాణిక్యాలరావు మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. కరోనా సోకుంతుందన్న ఒక్క రోజు ముందు కూడా తనతో మాట్లాడినట్లు చెప్పారు. మణిక్యాలరావు కుటంబ సభ్యులకు ఎంపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement