- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నాకు తెలిసిన జగన్ మొనగాడనుకున్నా’
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ఇప్పటి వరకు జగన్ మగాడు అనుకున్నానని… కానీ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు.’ అని ఘాటుగా విమర్శించారు. అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని, నిర్ణయాన్ని పునఃసమీక్షించి, ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘నాకు తెలిసిన జగన్ రెడ్డి ఎంతో ధైర్యవంతుడు. ఆయన మగాడు.. మొనగాడు అనుకున్నాను. ఈ రకంగా స్థాయి తగ్గించుకుంటాడని అనుకోలేదు. ఉన్నతంగా ఉండాలని అనుకునేవాడిని… మీకు మీరు తగ్గించేసుకుంటారని అనుకోలేదు. నాస్థాయి పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. మీ స్థాయి తగ్గడం బాధగా ఉంది.’ అని వ్యాఖ్యానించారు.
Next Story