ఇంకా ఎందరిని బలి తీసుకుంటారు…

by Anukaran |   ( Updated:2020-09-27 12:33:09.0  )
ఇంకా ఎందరిని బలి తీసుకుంటారు…
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా బి.కొత్త కోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగింది. ఈ దాడిపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక ఎంత మంది దళిత బిడ్డలను బలి తీసుకుంటారని సీఎం జగన్‌ను ఆయన ప్రశ్నించారు. మీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన మండిపడ్డారు. రామచంద్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన ట్విట్లర్ లో తెలిపారు. రామచంద్రపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story