జగన్‌దో చెత్త ప్రభుత్వం: నారాలోకేశ్

దిశ, వెబ్‌డెస్క్: పబ్లిసిటీ పిచ్చి తప్ప జగన్‌కి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని నారా లోకేశ్ అన్నారు. ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఎం కావాలంటూ.. ఓ వీడియో షేర్ చేశారు. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, జరజాపు పేట బిసి కాలనిలో కరోనా బారిన పడిన ముగ్గురు వ్యక్తులను చెత్త బండిలో తరలించిన విషయం తెలిసిందే. ఈ వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేసిన లోకేశ్.. ఇది అమానుష ఘటన అని అన్నారు.

ఆసుపత్రుల్లో చనిపోయిన వారిని గంటల తరబడి అలానే వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా బారిన పడిన వారిని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా చెత్త బండిలో తరలించడం దారుణమంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. మొద్దునిద్రపోతున్న సర్కార్ మేల్కోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపు వాయిదా వేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టండి జగన్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

Advertisement