- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ కాదు.. వాళ్లది జేసీబీ ప్రభుత్వం : నారా లోకేష్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాలోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. గురువారం తిరుపతిలోని వెంకటగిరిలో ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే దమ్ము లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో ఏ-1ముద్దాయిగా ఉన్నాడని, అధికార పార్టీ మరో ఎంపీ ఏ-2గా ఉన్నాడని గుర్తుచేశారు. ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వానికి నారాలోకేష్ కొత్త అర్థాన్ని చెప్పారు. ఏపీలో నడిచేది ‘వైసీపీ ప్రభుత్వం కాదు.. జేసీబీ ప్రభుత్వం’ నడుస్తోందన్నారు. జేసీబీ అంటే ‘జగన్ బాదుడు సర్వీస్’ అని వెల్లడించారు.
Advertisement
Next Story