అమెజాన్‌లో నాని 'వి'లనిజం

by  |
అమెజాన్‌లో నాని విలనిజం
X

నేచురల్ స్టార్ నాని నెగటివ్ షేడ్‌లో నటిస్తున్న ‘వి’ చిత్రం అప్‌డేట్ వచ్చేసింది. సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్న చిత్రాన్ని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించారు. నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటించిన చిత్రం ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయినా సరే నిర్మాత దిల్ రాజు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక డైరెక్ట్‌గా థియేటర్‌లోనే సినిమా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఆ చాన్స్ లేదని డిసైడ్ అయ్యాక.. అందరిలానే ఓటీటీని ఆశ్రయించాడు.

‘వి’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాని 25వ చిత్రం అయిన ఈ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతూ థాంక్స్ నోట్ షేర్ చేశాడు నాని. తన 25వ చిత్రం చాలా స్పెషల్ అని.. దీన్ని ఒక జ్ఞాపకంగా మలచాలని కోరాడు. ఈ 12 ఏళ్ల సినీ ప్రయాణంలో మీరందరూ నా కోసం థియేటర్లకు వస్తే.. ఈ సారి నేనే మీ ఇంటికి థాంక్స్ చెప్పేందుకు వచ్చేస్తున్నట్లు చెప్పాడు నాని. టక్ జగదీష్‌తో థియేటర్స్‌లో కచ్చితంగా
ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానని ప్రామిస్ చేశాడు.


Next Story

Most Viewed