సత్యదేవ్‌కు ఫ్యాన్ అయిపోయా : నాని

by  |
సత్యదేవ్‌కు ఫ్యాన్ అయిపోయా : నాని
X

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్య దేవ్ కథానాయకుడు. జూలై 30న ఓటిటిలో విడుదలైన ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్రం నిర్మాత శోభు యార్లగడ్డ డైరెక్టర్ మహాని ప్రశంసించిన తీరు అద్భుతం. బాహుబలికి నిర్మాత అయిన శోభు.. వెంకటేష్ మహాను రాజమౌళితో పోల్చారు. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ పర్ఫెక్ట్‌ విజన్ అని.

టౌన్ ఫోటోగ్రాఫర్‌కు సత్యదేవ్ నట విశ్వరూపం చూపించగా.. ఇది రీమేక్ సినిమాలా లేదని తెలుగు నేటివిటీకి తగినట్లుగా తెరకెక్కించారని విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. సత్య దేవ్ తన పాత్రలో జీవించాడని తెలిపిన డైరెక్టర్, రచయిత కోన వెంకట్.. నేచురల్ రూరల్ డ్రామాలో ప్రతీ క్యారెక్టర్ అద్భుతంగా ఉందన్నారు.

ఇక హీరో నాని ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ను అందమైన చిత్రంగా అభివర్ణించారు. దయచేసి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని కోరారు. క్లోజ్ అప్, స్లో మోషన్ స్మైల్స్ బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఆశగా ఉందన్నారు నాని. సత్య దేవ్‌కు అభిమానిని అయిపోయానన్న నాని.. సుహాస్ యాక్టింగ్ హిలేరియస్‌లో ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడు.



Next Story

Most Viewed