జున్నుకు హెల్ప్ చేస్తున్న ‘నాని’

by  |
జున్నుకు హెల్ప్ చేస్తున్న ‘నాని’
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ తారల పర్సనల్ విషయాల గురించి తెలుసుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇక అభిమానులైతే ఇంకొంచెం ఎక్కువగానే ఆరాటపడుతుంటారు. అభిమాన హీరో, హీరోయిన్ల నుంచి చిన్న వీడియో రిలీజ్ అయినా సరే.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేదాకా వదిలిపెట్టరు. నేచురల్ స్టార్ నాని, కొడుకు జున్నులకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తుండగా.. అభిమానులు లైక్‌ల మీద లైక్‌లు కొడుతున్నారు.

https://www.instagram.com/p/CEjDqRMgMyj/?utm_source=ig_web_copy_link

ఇంతకీ వీడియో దేని గురించి అనుకుంటున్నారా?.. జున్ను ఆన్‌లైన్ క్లాసుల గురించి. ల్యాప్‌టాప్‌లో ఆన్‌లైన్ క్లాస్ వింటున్న జున్నుకు నాని హెల్ప్ చేస్తున్న వీడియో చాలా క్యూట్‌గా ఉంది. జున్ను ముద్దు ముద్దు మాటలు ఇంకా ముద్దొస్తుండటంతో ఆటోమేటిక్‌గా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

కాగా, నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నాని ఫస్ట్ టైమ్ నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.


Next Story

Most Viewed