- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : పదవి పోగొట్టుకున్న నందిపేట ఉపసర్పంచ్
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీ అయిన నందిపేట ఉప సర్పంచ్ వాసరి రాంచందర్ తన పదవి పోగొట్టుకున్నారు.ఈ మేరకు కలెక్టర్ (పంచాయతీ విభాగం) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ నందిపేట గ్రామ పంచాయతీకి చెందిన పలువురు వార్డు సభ్యులు ఇటీవల ఆర్మూర్ డివిజనల్ పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై జూలై 28న నందిపేట పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఉపసర్పంచ్ వాసరి రాంచందర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ గ్రామపంచాయతీ పాలకవర్గంలో మొత్తం 17 మంది వార్డు సభ్యులుండగా 10 మంది సభ్యులు హాజరయ్యారు.
పంచాయతీ రాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత నందిపేట GPలోని మొత్తం పాలకవర్గంలో తొమ్మిది మంది సభ్యులు సమావేశానికి హాజరైతే ‘కోరమ్’ సరిపోతుంది. ఈ అవిశ్వాస తీర్మానం ‘కోరమ్’నకు సరిపడా అనగా 10 మంది సభ్యులు హాజరయ్యారు. దీంతో అధికారులు సమావేశాన్ని కొనసాగిస్తూ ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. హాజరైన వారంతా అంటే 10 మంది వార్డు సభ్యులు తీర్మానానికి అనుకూలమని చెబుతూ.. అంటే పదవి నుంచి తొలగించాలని కోరుతూ చేతులెత్తారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందింది. దాని ఆధారంగా పంచాయతీ విభాగం కలెక్టర్ రిమూవల్ ఆర్డర్‌ను తయారు చేశారు. నందిపేట ఉప సర్పంచ్ వాసరి రాంచందర్‌ను పదవి నుంచి వైదొలిగిస్తున్నట్టు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.