ఆ ఆలయంలో… నంది విగ్రహ చెవి ధ్వంసం

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో నంది విగ్రహం చెవి ధ్వంసం అయింది. ఈ ఘటన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దహనం అయిన విషయం ఇంకా మరువక ముందే, ఈ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement