అవసరమైతే జగన్ ను కలుస్తా -బాలకృష్ణ

దిశ, ఏపీ బ్యూరో: హిందూపురం అభివృద్ధి కోసం ఎందాకైనా వెళ్తా. అవసరమైతే సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడతానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన నియోజవర్గంలో పర్యటించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రికి రూ. 55 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను అందజేశారు.

హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపు చర్యలే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కన్నా ఏపీకి అధిక ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్నారు.

Advertisement