సితారను ముద్దు చేస్తూ గౌతమ్ .. క్యూట్ పిక్

by  |
సితారను ముద్దు చేస్తూ గౌతమ్ .. క్యూట్ పిక్
X

లాక్ డౌన్ లో సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ. సితార, గౌతమ్ తో కలిసి ఆడుకుంటూనే వర్క్ అవుట్ పై కాన్సంట్రేట్ చేస్తున్నాడు మహేష్. సితార పాటలు, గౌతమ్ ఆటలు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఇక మహేష్ న్యూ లుక్ నెట్టింట వైరల్ అయిపోగా.. ఇంతకు మించి వైరల్ అయిపోయే సూపర్ క్యూట్ పిక్ షేర్ చేసింది నమ్రత శిరోద్కర్. మీ జీవితాన్ని అనుభవాలతో నింపండి వస్తువులతో కాదు.. మీకంటూ చెప్పుకోడానికి కొన్ని కథలు సిద్ధం చేసుకోండి అని సూచించిన నమ్రత… ఇదిగో నా లైఫ్ లైన్స్ అంటూ మెమరీ థెరపీ లో భాగంగా అభిమానులకు అదిరిపోయే ఫోటో అందించింది.

https://www.instagram.com/p/CAwiTzgjEcI/?igshid=3yraglqk1dpf

ప్రెట్టీ గర్ల్ సితు పాపను తన అన్న గౌతమ్ ముద్దు చేస్తున్న చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది నమ్రత. ఒకే ఫ్రేమ్ లో క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అయిపోగా.. పిక్చర్ కు లైకులు, కామెంట్లు పడిపోతూనే ఉన్నాయి. ఇంత అందమైన పిల్లల్ని ఎంత చూసినా తనివితీరడం లేదంటున్న నెటిజన్లు.. క్యూటెస్ట్ పిక్ ఆఫ్ ద డే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి కొందరేమో.. మహేష్ అర్జున్ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్తున్నారు.


Next Story

Most Viewed