- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డప్పు చాటింపు చేయించి.. మైకుల ద్వారా చెప్పండి
దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశలో ఉన్నందున, దాని వ్యాప్తి నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉన్నదని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నేను-నా ఊరు పేరుతో మండల పరిధిలోని సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
కరోనా పాజిటివ్ వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం సరికాదని, వారికి అన్ని రకాల జాగ్రత్తలతో ఐసోలేషన్‌లో ఉంచేలా చూడాలని సర్పంచులకు సూచించారు. ప్రజలు ఎవరన్నా కరోనా సోకిన వ్యక్తుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉన్నదన్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం, వంటి నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యశాఖ సిబ్బందిని సంప్రదించి వైద్య సహాయం పొందాలని, కరోనా సోకిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ధైర్యంగా ఉంటూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం, సరైన మందులు తీసుకొని కరోనాను జయించాలని సూచించారు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా, భయానికి లోను కాకుండా కోవిడ్ అరికట్టే విధంగా ప్రతిఒక్కరూ తమతో సహకరించాలని ఆయన కోరారు. మార్చి నుంచి ఇప్పటివరకూ పోలీస్ సిబ్బంది విస్తృతంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం డప్పు చాటింపు వేయించడం, మైకుల ద్వారా సూచనలు చేయడం లాంటి కార్యక్రమాలు పంచాయితీల ఆధ్వర్యంలో నిర్వహించాలని డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.