- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాస్కులను పంచాయతీ నిధులతో కొనుగోలు చేయాలి

X
దిశ నల్లగొండ: మహిళా సమాభావన సంఘాలు తయారు చేస్తోన్న మాస్క్‌లను గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహిళా సంఘాలకు మాస్కుల తయారీ బాధ్యతను అప్పగించారు. తయారు చేసిన మాస్కులను గ్రామ పంచాయతీలకు విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, కలెక్టర్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ దగ్గర ఉండి మహిళా సంఘాలతో మాస్కులను తయారు చేయించారు. ఒక్కో మాస్కు ధరను రూ. 15 గా నిర్ణయించారు. వీటిని గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసి, గ్రామస్తులకు పంపిణీ చేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: collector prashanth, statement, Masks, distributed, free of charge, nalgonda
Next Story