సాగర్ ఉప ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. ఇవి తప్పనిసరి

by Shyam |
Nalgonda Collector Prashant Jeevan Patil
X

దిశ, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు ఎలక్రో ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లను గుర్తించేందుకు ఎపిక్ కార్డుతో పాటు ఓటర్లు పోలింగ్ బూత్‌కు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆధార్ కార్డ్, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం జాబ్ కార్డ్, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటో కలిగి ఉన్న పాస్ బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, జాతీయ జనాభా నమోదు కింద భారత రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఇండియన్ పాస్‌పోర్టు, పబ్లిక్ సెక్టార్, లోకల్ బాడీస్, ప్రైవేట్ ఇండస్ట్రీయల్ హౌస్ ఎంప్లాయిస్ సర్వీస్ ఐడెంటి కార్డ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అఫీషియల్ ఐడెంటి కార్డ్ కలిగి ఉండాలన్నారు. ఎలక్ట్రో ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు లేకున్నా 11 ధ్రువీకరణ పత్రాలలో ఒకటి తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన ఈ ప్రకటనలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story