దేశ ప్రధాని నగ్నవిగ్రహం.. ఎక్కడంటే

by Anukaran |   ( Updated:2021-03-18 05:56:46.0  )
Prime Minister Benjamin Netanyahu
X

దిశ, ఫీచర్స్: మరో ఐదురోజుల్లో (మార్చి 23న) ఎన్నికలు జరగనుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆ దేశ ప్రధాని నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ వార్త మీడియాలో వైరల్ కాగా, మునిసిపాలిటీ అధికారులు వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించారు. కాగా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడింది అతడి ప్రత్యర్థులా? దీని వెనక ఇంకెవరి హస్తం ఉందన్న విషయమై విచారణ జరుగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయిల్‌లో అత్యధిక జనాభా గల టెల్ అవివ్‌ సిటీలోని హంబిమా స్క్వేర్ వద్ద ఇటీవల ప్రధాని బెంజమిన్ నేతన్యాహు నగ్న విగ్రహం ఏర్పాటు చేశారు. 5 మీటర్ల ఎత్తు‌తో 6 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని ‘ఇజ్రాయిలీ హీరో’ అనే క్యాప్షన్‌తో ఆవిష్కరించారు. దీన్ని ఎవరు రూపొందించారన్న విషయం తెలియరాలేదు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కాగా, వెంటనే అప్రమత్తమైన అధికారులు దాన్ని తొలగించారు. ఇజ్రాయిల్‌లో ఈ రెండేళ్లలో ఎన్నికలు జరగడం ఇది నాలుగోసారి(ఈ నెల 23న). అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతన్యాహు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులే ఈ పని చేసి ఉంటారేమో? అని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా నేతన్యాహు ఇజ్రాయిల్‌కు అతి ఎక్కువకాలం(14 ఏళ్లు) ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా ఇప్పటికే చరిత్ర సృష్టించాడు.

Advertisement

Next Story

Most Viewed