- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కింగ్ నాగార్జునతో ‘ఉప్పెన’ హీరో.. కాంబినేషన్ అదిరిపోనుందా?

X
దిశ, సినిమా : ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డులు సృష్టించగా ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రెండో చిత్రాన్ని కూడా మొదలుపెట్టిన వైష్ణవ్.. క్రిష్ డైరెక్షన్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. కాగా మూడో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో చేయబోతున్నాడని టాక్.
నాగార్జున నిర్మాత కాగా కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్న సినిమా షూటింగ్ జూలై నుంచి ఉండబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. కాగా ఈ కాంబినేషన్‌లో మూవీ వస్తోందని తెలిసిన మెగా ఫ్యాన్స్ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. వైష్ణవ్ కెరియర్‌లో మరో ఉప్పెనలాంటి వసూళ్లు రావాలని కోరుకుంటున్నారు.
Next Story