అమీర్ ఖాన్‌తో పాటు లవ్‌స్టోరీ టీమ్‌కు సర్ ప్రైజ్ ఇచ్చిన నాగార్జున..

by Shyam |   ( Updated:2021-09-25 06:51:36.0  )
chaithanya
X

దిశ సినిమా: అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ని ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌ కాగా.. థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ మూవీ ప్రచార కార్యక్రమం తర్వాత నాగార్జున ఫ్యామిలీ అమీర్ ఖాన్ కోసం విందు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నాగ చైతన్య పాత్ర పేరు రివీల్ చేశారు. అయితే అమీర్ ఖాన్‌తో స్క్రీన్ పంచుకున్న నాగ చైతన్య పాత్ర పేరు ‘బాలరాజు’ అని తెలిపారు. కాగా నాగార్జున తండ్రి లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 70ఏళ్ల క్రితం ‘బాలరాజు’ సినిమాలో అదే పేరుతో నటించారని, ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న నాగార్జున తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Advertisement

Next Story