యువకుడి దారుణ హత్య

by  |
యువకుడి దారుణ హత్య
X

దిశ, నాగార్జునసాగర్: హాలియా పట్ణణ సమీపంలో సాగర్​ ఎడమకాల్వ అక్విడెక్ట్​ ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన యానక ప్రభాకర్ (32) గురువారం సాయంత్రం ఎడమకాల్వ కట్టపై దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం సాయంత్రం 5 నుండి 5.30గంటల సమయంలో ప్రభాకర్​ కాల్వ కట్టపైకి వచ్చినట్టుగా సీసీ పుటేజీల్లో ఉన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఓయువకుడు అటువైపే వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్​కు వివాహం కాగా భార్య గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.



Next Story