- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ విషయంలో ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యా : నాగ చైతన్య
దిశ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వరల్డ్ అమేజింగ్‌గా ఎక్స్‌ప్లోర్ అయింది. ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ బిగ్ స్క్రీన్‌పై చూపించలేని కంటెంట్‌ను డిజిటల్ వరల్డ్‌లో అన్వేషించేందుకు ట్రై చేస్తున్నారు. చాలా ఫ్రీడమ్‌తో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్స్‌గా వస్తున్న ‘పిట్టకథలు’ ఆంథాలజీలో ఇలాంటి ప్రయోగాలే జరిగాయని తెలిపారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. లక్ష్మీ మంచు, శ్రుతి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బా, జగపతిబాబు ప్రధానపాత్రల్లో వస్తున్న ఆంథాలజీ ఫిబ్రవరి 19న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్ అండ్ యాక్టర్స్.
ఈ సందర్భంగా పలువురు యాక్టర్స్‌తో వర్చువల్‌గా మాట్లాడిన తరుణ్ భాస్కర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై హీరో నాగ చైతన్య ఒపీనియన్ గురించి ప్రశ్నించారు. బిగ్ స్క్రీన్‌పై కనిపించే మీరు డిజిటల్ వరల్డ్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో 15 నిమిషాల కంటెంట్‌లో కనిపించడం ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు చైతు మంచి సమాధానమిచ్చారు. నటుడిగా తానెప్పుడూ డిఫరెంట్‌గా ట్రై చేయాలనే కోరుకుంటానని తెలిపారు. తెరపై ఆవిష్కరించేందుకు తన మనసులో చాలా విషయాలున్నాయి కానీ, అనుకున్నవన్నీ బిగ్ స్క్రీన్‌పై చూపించలేమన్నారు. ఎందుకంటే మనం బిగ్ స్క్రీన్ ఫార్మాట్‌కు బాగా అలవాటు పడిపోయి, అలాంటి కంటెంట్ చూపించేందుకు భయపడిపోతున్నామని తెలిపారు. దీనికి చాలా నియమనిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుందన్నారు. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఓటీటీ ప్రస్తుతం చేస్తున్నది అదే కాబట్టి.. తను ఖచ్చితంగా ఆసక్తిగా ఉన్నానని, ప్రయత్నించాలని అనుకుంటున్నానని తెలిపారు. బిగ్ స్క్రీన్ అండ్ ఓటీటీని బ్యాలెన్స్ చేయడం ప్రారంభించాలని తెలిపాడు చైతు.