- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నాగ్
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమా కొంత కాలం క్రితం సూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాలో నాగార్జున చేసి “బంగార్రాజు” పాత్రకు విశేష స్పందన రావడంతో, అదే పేరుతో మరో సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యారు నాగ్. ఆ చిత్ర కథను రెడీ చేసేపనిని ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కు అప్పచెప్పారు. నాగార్జునకు నచ్చేవిధంగా కథపై కసరత్తు చేశారు కళ్యాణ్. అయినటప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున జులై లో “బంగార్రాజు” షూటింగ్ మొదలు కానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానుల్లో సంతోషం నెలకొంది. ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు.
Next Story