- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెంచ్ ఓపెన్‌లో వారిద్దరే..
దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్ (French Open) టెన్నిస్ టోర్నీ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలుత క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. సెప్టెంబర్ 27 నుంచి ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. కాగా, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫేవరెట్లు నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ అని డోమినిక్ థీమ్ పేర్కొన్నాడు. ఇటీవలే యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన థీమ్.. క్లే కోర్టులో వారిద్దరే పై చేయి సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. గత రెండేళ్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరిన థీమ్.. నాదల్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
అయితే, యూఎస్ ఓపెన్‌లో నాదల్ ఆడకపోవడంతో పాటు జకోవిచ్‌పై అనర్హత వేటు పడటంతో థీమ్ విజేతగా నిలిచాడు. హార్డ్, క్లే కోర్టుల్లో బిగ్ త్రీగా చెప్పుకునే నాదల్, ఫెదరర్, జకోవిచ్‌లే గత కొన్నాళ్లుగా టైటిల్స్ సాధిస్తున్నారు. కాగా, ఆస్ట్రియాకు చెందిన థీమ్ తన కెరీర్‌లో 17 టైటిల్స్ గెలవగా వాటిలో 10 ఇలాంటి కోర్టులపైనే దక్కాయి. యూఎస్ ఓపెన్‌లో పాల్గొనని నాదల్ ఆ సమయంలో క్లే కోర్టులపై ప్రాక్టీస్ చేశాడని.. అతనికి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని థీమ్ వెల్లడించాడు.