నా బరువు జాతీయ సమస్యలా మారింది : విద్యాబాలన్

by Shyam |
Vidya Balan
X

దిశ, సినిమా: ఇదివరకు హీరోయిన్ అనగానే సన్నజాజిలా ఉండాలి, దేవకన్యలా మెరిసిపోవాలనే కాన్సెప్ట్ ఉండేది. కానీ ‘అభినయం’ ఉంటే చాలు, ఇతరత్రా అర్హతలు అవసరం లేదని నిరూపించిన ఎంతోమంది హీరోయి‌న్స్‌లో బాలీవుడ్ బబ్లీ బ్యూటీ ‘విద్యాబాలన్’ ఒకరు. ఆమె బొద్దుగా ఉన్నా ప్రేక్షకులు అదేం పట్టించుకోలేదు. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీ వర్గాలు ఆమె వెయిట్ గురించి కామెంట్ చేసినా.. ఆ తర్వాత ఆమె పోషించిన పాత్రలు, నటనతోనే వారికి సమాధానం చెప్పింది. అనారోగ్య సమస్యల కారణంగా బరువు పెరిగిన విద్యా బాలన్.. మొదట్లో తన శరీరాన్ని తానే ద్వేషించుకునేదని, తాను ఎందుకు ఇంత లావుగా ఉన్నానని బాధపడినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘నా వెయిట్ చాలాసార్లు ఇబ్బంది కలిగించింది. చాలా కాలం వరకు నేను నా శరీరాన్ని అసహ్యించుకున్నాను. నేను సినిమాయేతర కుటుంబం నుంచి వచ్చాను. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయిని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నాకు చెప్పడానికి ఎవరూ లేరు. దాంతో ఒకానొక సమయంలో నా వెయిట్ ఏకంగా జాతీయ సమస్య అన్నట్లుగా చర్చ జరిగింది. నా వెయిట్ గురించి అందరూ మాట్లాడుతున్న సమయంలో నిరాశకు లోనయ్యాను. నేను హార్మోన్ల సమస్యలను ఎదుర్కోవడంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. కానీ జీవితంలో ముందుకెళ్తున్న క్రమంలో.. నా శరీరాన్ని ప్రేమించుకోవాలని భావించాను. ఈ శరీరమే లేకుంటే నేను లేను కదా అని అనుకున్నాను. అలా ప్రతిరోజూ నన్ను నేను కొంచెం ఎక్కువగా ప్రేమించడం, అంగీకరించడం మొదలుపెట్టాను. అందువల్ల నేను ప్రేక్షకులకు మరింత ఆమోదయోగ్యంగా మారడంతో పాటు నాపై ఎంతో అభిమానాన్ని కురిపించారు’ అని చెప్పుకొచ్చిన విద్య.. బరువు గురించి దిగులు పడకుండా, మీ లక్ష్యం దిశగా సాగిపోండని పేర్కొంది.

Advertisement

Next Story