సీఎంఆర్ఎఫ్‌కు ఎంవీఐల నెల జీతం విరాళం

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్)కి తెలంగాణ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ల అసోషియేషన్ ఒక నెల గ్రాస్ సాలరీని విరాళంగా ప్రకటించింది. నెల జీతం రూ. కోటిన్నరను కరోనాతో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంఘీభావంగా అందజేస్తున్నామని వారు తెలిపారు. మే ఒకటో తారీఖున క్రెడిట్ అవబోయే మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ల ఏప్రిల్ నెల గ్రాస్ సాలరీని సీఎం సహాయనిధికి జమచేస్తున్నట్టుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags : telangana, mvi association, one month salary, cmrf

Advertisement

Next Story