- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Muthoot Finance లాభం రూ. 931 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) నికర లాభం 2.5 శాతం పెరిగి రూ. 930.80 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 908.54 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 17.4 శాతం పెరిగి రూ. 2,824.19 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,406.39 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది.
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత రుణ ఆస్తులు 29 శాతం పెరిగి రూ. 52,286 కోట్లకు చేరుకున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో తెలిపింది. ఈ ఫలితాల్లో అనుబంధ సంస్థలైన ముత్తూట్ హోమ్‌ఫిన్ ఇండియా లిమిటెడ్, ముత్తూట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్ తదితర సంస్థల ఫలితాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. స్వతంత్ర ప్రాతిపదికన ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం రూ. 884.39 కోట్లకు పెరిగిందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 857.92 కోట్లు, ఆదాయం రూ. 2,584.47 కోట్లుగా ఉందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ మెరుగైన వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం 3.81 శాతం తగ్గి రూ. 1,190.05 వద్ద ముగిశాయి.