- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాస్క్‌లు ధరించకుంటే జరిమానా తప్పదు: ఇన్‌చార్జ్ ఎస్పీ

X
దిశ, ఆసిఫాబాద్: ప్రజలందరూ విధిగా మాస్క్ లు ధరించాలని జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడాలన్నారు. ఎవరైనా మాస్క్ లు ధరించకుండా రోడ్లపై తిరిగితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, గుంపులుగా ఉండకూడదని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులు మాస్క్ తోపాటు దూరం పాటించాలని, దానికి యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
- Tags
- Masks
Next Story