ఇండ్లలోనే ప్రార్థనలు

by Shyam |
ఇండ్లలోనే ప్రార్థనలు
X

దిశ, నిజామాబాద్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించవద్దని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ.పాటిల్ సూచించారు. శనివారం పట్టణంలోని లింర్రా గార్డెన్‌లో ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశమైంది. మున్సిపల్ కమిషనర్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌లు మాట్లాడుతూ… నిజామాబాద్ రెడ్‌జోన్‌లో ఉన్నందునా కంటైన్‌మెంట్ ఏరియాల్లో ప్రజలు బయటకు రాకూడదన్నారు. రెడ్‌జోన్‌లలో ప్రజలకు కావలిసిన నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తున్నామన్నారు. మజీద్‌లలో మౌజామ్‌లతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని వారికి పాస్‌లు కూడా ఇస్తామన్నారు. ఉదయం, సాయంత్రం మజీద్‌ల నుంచి సైరన్ మోగిస్తామన్నారు. ప్రజలు ఇళ్ల వద్ద ప్రార్థన చేసుకోవాలన్నారు. పేదలకు ఇచ్చే కానుకలను ఇళ్ల వద్ద భౌతిక దూరం పాటించి పంపిణీ చేయలన్నారు. ఇప్తార్ విందులు, సామూహిక ప్రార్థనలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ ఫహీమ్, ఎస్‌హెచ్‌ఓ ఆంజనేయులు పాల్గొన్నారు.

Tags: ramzan month, commissinor, acp, ps commitee, nizamabad, ts news



Next Story

Most Viewed