- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐదు భాషల్లో ‘మర్డర్’
వర్మ ఈ మధ్య జనాల పూర్తి అటెన్షన్‌ను క్యాచ్ చేస్తున్నాడు. లాక్‌డౌన్‌లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న వర్మ.. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశాడు. పవన్ జీవిత కథ ఆధారంగా పవర్‌స్టార్ సినిమా తీస్తూ.. అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న వర్మ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. తాజాగా బుధవారం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ.. తనకు పీకే ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని ఆరోపించాడు.
మరోవైపు పవన్ ఫ్యాన్స్.. ఆర్జీవీ మీద ‘పరాన్నజీవి’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించి పాట కూడా రిలీజ్ చేయగా.. అదంతా పట్టించుకోనని, టైమ్ వేస్ట్ పని అంటూ కొట్టిపారేశాడు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగుతుండగా.. మరో సినిమా అప్‌డేట్ ఇచ్చాడు వర్మ.
అమృత ప్రణయ్, మారుతీ రావు కథ ఆధారంగా మర్డర్ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఈ క్రైమ్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాబట్టి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 28న ఉ: 09:08 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.