- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూతగాదాలు.. కత్తులతో దాడి.. ఒకరు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : భూ తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామంలో భూమి గురించి దేవయ్య, ప్రదీప్ కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. వీరి మధ్య గత కొన్నేళ్లుగా ఈ వైరం కొనసాగుతుండగా.. తండ్రీ కొడుకులపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన దేవయ్య కొడుకు కరుణాకర్ మృతి చెందగా.. దేవయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story