తబ్లీగీ జమాత్ నేతపై హత్య కేసు

by vinod kumar |
తబ్లీగీ జమాత్ నేతపై హత్య కేసు
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మౌలానా కారణమయ్యారని ఆరోపిస్తూ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను వదిలేసి మతపరమైన సదస్సు నిర్వహించి పలువురి మరణాలకు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు.
ఢిల్లీ మర్కజ్ సదస్సు తరువాత దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సదస్సుకు హాజరైన వారిలో చాలామందికి కరోనా సోకగా, పలువురు మృతి చెందారు. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మాలానా సాద్‌పై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Tags: maulana saad, tablighi jamaat, markaz, delhi police



Next Story

Most Viewed