'తెలంగాణలో సర్పంచ్‌గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..'

by Shyam |   ( Updated:2020-05-26 00:58:41.0  )
తెలంగాణలో సర్పంచ్‌గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..
X

దిశ,నల్లగొండ: మునుగోడులో వాటర్ ట్యాంక్ పైకి సర్పంచ్ ఎక్కి నిరసన తెలపడం కలకలం సృష్టించింది. తెలంగాణలో సర్పంచ్‌గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాజెక్టులు అవసరం లేదు.. ముందైతే తాగునీరు ఇవ్వండంటూ మునుగోడు గ్రామ సర్పంచ్ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచి గ్రామానికి తాగునీరు సరఫరా కావడం లేదని ఏకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండల కేంద్రానికి కొద్ది రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. ఫలితంగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో మునుగోడు సర్పంచ్ వెంకన్న ఏకంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వాటర్ ట్యాంక్ ఎక్కి పైనుంచే ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈకి ఫోన్ చేసి.. తెలంగాణలో సర్పంచ్‌గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. అక్కడే ఉన్న గ్రామస్తులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed