- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగ్నంగా ఆమె మృతదేహం.. అవాస్తవం
దిశ, వెబ్‌డెస్క్ : హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ దిశా సలియన్ మరణించాక ఆమె డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవల మీడియాలో వార్తలు సర్క్యూలేట్ అయ్యాయి. వాటిన ముంబై పోలీసులు ఖండించారు. అవన్నీ అవాస్తవాలని డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ స్పష్టంచేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారని.. ఆమె పేరెంట్స్ సమక్షంలోనే మృతదేహానికి పంచనామా చేసినట్లు తెలిపారు.
జూన్ 8న రాత్రి మలాద్లోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి దిశ సలియాన్ సూసైడ్ చేసుకుంది. సరిగ్గా 5 రోజుల తర్వాత సుశాంత్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ రెండు ఘటనలు బాలీవుడ్ సహా రాజకీయంగా కలకలం రేపాయి.
రెండు వేర్వేరు ఘటనలను కొంత మంది నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇప్పటికే తమ కుమార్తె మృతిపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దిశ ఫ్యామిలీ స్పష్టంచేసింది. ముంబై పోలీసులు చాలా నిజాయతీగా దర్యాప్తు చేస్తున్నారని.. తమను అపఖ్యాతిపాలు చేయాలని చూడటం బాధ కలిగించిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.