- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సర్కార్‌కు చురకలంటించిన సీతక్క

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ప్రజల సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది. అయితే, తాజాగా హైదరాబాద్ లో ఊహించని భారీ వర్షం రావడంతో నగరం మొత్తం అతలాకుతం అయిన విషయం తెలిసిందే.. దీనిపై సీతక్క ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేధికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఆమె చేసిన ట్వీట్ ప్రకారం ‘ఢిల్లీ వీధుల్లో టీఆర్ఎస్ సంబురాలు… హైదరాబాద్ గల్లీ గల్లీలో ప్రజల అవస్థలు..’అంటూ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతూ ..‘‘జెండా పండగలు కాదు.. జనం కోసం పనులు చేయండి’’అంటూ టీఆర్ఎస్ నాయకులను ట్యాగ్ చేస్తూ రీట్వీట్‌లు చేస్తున్నారు.
ఢిల్లీ వీధుల్లో TRS సంబరాలు..!!
హైదరాబాద్ గల్లీ గల్లీలో ప్రజలు అవస్థలు..!!!
Comment please @KTRTRS @trspartyonline pic.twitter.com/C8arU8lK7U— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 3, 2021