‘పీవీ’పై కేసీఆర్‌ది కపట ప్రేమ : సీతక్క

by Shyam |   ( Updated:2020-09-08 23:42:10.0  )
‘పీవీ’పై కేసీఆర్‌ది కపట ప్రేమ : సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఇన్నిరోజులుగా గుర్తుకు రాని పీవీపై అకస్మాత్తుగా ఎందుకు ప్రేమ చూపిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పీవీ పేరు వాడుకుంటున్నారని సీతక్క విమర్శించారు.

చంద్రశేఖర్ రావు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పీవీ ఎందుకు గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. PV చనిపోయిన సమయంలో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు రాని KCR.. ఆయన సీఎం అయిన ఆరేళ్లకు అతి ప్రేమ కురిపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ సిద్ధించిన సమయంలో అదే గడ్డమీద పుట్టిన పీవీకి ‘భారతరత్న’ ఇవ్వాలని అప్పుడు ఎందుకు అడగలేదని.. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని ములుగు ఎమ్మెల్యే తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు.

Advertisement

Next Story